వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్‌ మామ | CWC 2023: Kane Williamson Covering His Face While Laughing After Worst DRS | Sakshi
Sakshi News home page

World cup 2023: అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్‌ మామ! వీడియో వైరల్‌

Published Thu, Nov 9 2023 5:32 PM | Last Updated on Thu, Nov 9 2023 5:54 PM

Kane Williamson Covering His Face While Laughing After Worst DRS - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తీసుకున్న రివ్యూ నవ్వులు పూయించింది. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కేవలం 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ పేస్‌ బౌలర్‌ లూకీ ఫెర్గూసన్‌ను మరోసారి బౌలింగ్‌ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. 

లంక ఇన్నింగ్స్‌ 24 ఓవర్‌ వేసిన ఫెర్గూసన్‌ మూడో బంతికి కరుణరత్నేను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చమీరాకు ఫెర్గూసన్‌.. నాలుగో బంతిని ఫుల్‌టాస్‌గా సంధించాడు. అయితే బంతి ఇన్్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని చమీరా ప్యాడ్‌కు తాకింది. కానీ న్యూజిలాండ్‌ ఆటగాళ్లు మాత్రం ఎల్బీకి అప్పీలు చేశారు.

ఈ క్రమంలో ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న డార్లీ మిచెల్‌ మాత్రం కాన్ఫిడెన్స్‌తో రివ్యూ తీసుకోమని కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను సూచించాడు. దీంతో సీనియర్‌ ఆటగాడి మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు.

అయితే రిప్లేలో క్లియర్‌గా బాల్‌ బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన కివీస్‌ ప్లేయర్స్‌ ఒక్కసారిగా నవ్వుకున్నారు. కివీస్‌ కెప్టెన్‌ నవ్వు అపుకోలేక తన చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్‌.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement