CWC 2023 Ind vs NZ: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన టీమిండియా | ODI World Cup 2023 IND Vs NZ First Semi Final In Mumbai: Toss And Live Score Updates, Highlights And Viral Videos - Sakshi
Sakshi News home page

IND Vs NZ Semi Final Live Score Updates: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన టీమిండియా

Published Wed, Nov 15 2023 1:30 PM | Last Updated on Wed, Nov 15 2023 10:48 PM

CWC 2023 1st Semi Final Ind Vs NZ: Toss Playing XI Highlights Live Updates - Sakshi

ICC Cricket World Cup 2023 - India vs New Zealand, 1st Semi-Final (1st v 4th) Updates: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్‌ జరుగుతోంది. అజేయ రికార్డుతో టేబుల్‌ టాపర్‌గా నిలిచిన టీమిండియా- నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో పోటీకి దిగింది. వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ అప్‌డేట్స్‌... టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 397 పరుగులు చేసింది.

ఫైనల్‌కు చేరిన టీమిండియా
వన్డేప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్‌.. ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది.

కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(134) విరోచిత శతకంంతో పోరాడినప్పటికీ.. తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. మిచెల్‌తో పాటు కెప్టెన్‌ కేన్‌ విలియమ్పన్‌(69) పర్వాలేదన్పించాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ అద్భుమైన ప్రదర్శన కనబరిచాడు. షమీ ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.  అతడితో పాటు బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఒక్క వికెట్‌ సాధించారు.
ఎనిమిదో వికెట్‌ డౌన్‌..
వరల్డ్‌కప్‌ సెమీస్‌లో విజయం దిశగా టీమిండియా కొనసాగుతోంది. 319 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ 8వ వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో శాంట్నర్‌ ఔటయ్యాడు.

ఐదు వికెట్లతో చెలరేగిన షమీ..
మహ్మద్‌ షమీ మరోసారి ఐదు వికెట్ల హాల్‌ సాధించాడు. కివీస్‌తో సెమీస్‌లో మిచెల్‌ను ఔట్‌ చేసిన షమీ.. ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.  న్యూజిలాండ్‌ విజయానికి 24 బంతుల్లో 90 పరుగులు కావాలి.

విజయం దిశగా భారత్‌..
298 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయిం‍ది. 2 పరుగులు చేసిన చాప్‌మన్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కివీస్‌ విజయానికి  36 బంతుల్లో 99 పరుగులు కావాలి.

బుమ్‌ బుమ్రా.. కివీస్‌ ఐదో వికెట్‌ డౌన్‌
295 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయిం‍ది.  41 పరుగులు చేసిన ఫిలిప్స్‌..  జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కివీస్‌ విజయానికి  42 బంతుల్లో 103 పరుగులు కావాలి.

పోరాడుతున్న మిచెల్‌
39 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. కివీస్‌ విజయానికి 66 బంతుల్లో 141 పరుగులు కావాలి. క్రీజులో డార్లీ మిచెల్‌(118), ఫిలిప్స్‌(18) పరుగులతో ఉన్నారు.

సూపర్‌ షమీ.. 
టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి.. కివీస్‌ మళ్లీ బ్యాక్‌ ఫుట్‌లో ఉంచాడు. 33 ఓవర్‌ వేసిన షమీ..  తొలుత అద్బుతంగా ఆడుతున్న కేన్‌ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపగా, ఆ తర్వాత టామ్‌ లాథమ్‌ను ఔట్‌ చేశాడు. 34 ఓవర్లకు న్యూజిలాం‍డ్‌ స్కోర్‌: 221/4. కివీస్‌ విజయానికి 96 బంతుల్లో 177 పరుగులు కావాలి.

డారిల్‌ మిచెల్‌ సెంచరీ
న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 85 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

హాఫ్‌ సెంచరీ చేసిన విలియమ్సన్‌..
న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 58 బంతుల్లో కేన్‌ మామ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. న్యూజిలాండ్‌ స్కోరు: 165-2(26)

అర్ధ శతకం పూర్తి చేసుకున్న డారిల్‌ మిచెల్‌
22.1:
కేన్‌ విలియమ్సన్‌తో కలిసి డారిల్‌ మిచెల్‌ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 50 పరుగుల మార్కును అందుకున్నాడు. న్యూజిలాండ్‌ స్కోరు: 148-2(23)

18 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 114/2
న్యూజిలాండ్‌ బ్యాటర్లు డారిల్‌ మిచెల్‌ (33), కేన్‌ విలియమ్సన్‌ (30) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 18 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 114/2

నిలకడగా ఆడుతున్న కేన్‌, మిచెల్‌
డారిల్‌ మిచెల్‌ 17, కేన్‌ విలియమ్సన్‌ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లలో స్కోరు: 87-2

పవర్‌ ప్లేలో న్యూజిలాండ్‌ స్కోరు: 46-2(10)
7.4: రచిన్‌ రవీంద్ర అవుట్‌
టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి మాయ చేశాడు. అద్భుత బంతితో రచిన్‌ రవీంద్ర(13(22) [4s-3])ను బోల్తా కొట్టించి రోహిత్‌ సేనకు రెండో వికెట్‌ అందించాడు. కేన్‌ విలియమ్సన్‌ (4), డారిల్‌ మిచెల్‌ క్రీజులో ఉన్నారు. కివీస్‌ స్కోరు: 40/2 (8)

 5.1: తొలి బంతికే వికెట్‌ దక్కించుకున్న షమీ
కాన్వే రూపంలో కివీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి డెవాన్‌ కాన్వే 13(15) [4s-3] వెనుదిరిగాడు.

5 ఓవర్లలో న్యూజిలాండ్‌ స్కోరు: 30/0
కాన్వే 13, రచిన్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 2 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ స్కోరు: 12/0
డెవాన్‌ కాన్వే(8), రచిన్‌ రవీంద్ర 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోహ్లి, అయ్యర్‌ సెంచరీలు
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. రోహిత్‌ శర్మ(47) సూపర్‌ ఇన్నింగ్స్‌కు తోడు మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకం(80-నాటౌట్‌)తో రాణించాడు.

ఇక విరాట్‌ కోహ్లి(117) రికార్డు సెంచరీతో కివీస్‌ బౌలర్లకు చు​‍క్కలు చూపించగా.. శ్రేయస్‌ అయ్యర్‌(105) తనదైన శైలిలో చెలరేగి శతకం బాదాడు. దీంతో ఈ మేరకు టీమిండియా భారీ స్కోరు నమోదు చేయగలిగింది.  న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీకి మూడు, ట్రెంట్‌ బౌల్ట్‌కు ఒక వికెట్‌ దక్కింది.

సెంచరీతో చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌
న్యూజిలాండ్‌తో సెమీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో అయ్యర్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 48 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 366/2

విరాట్‌ కోహ్లి ఔట్‌..
327 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 117 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కేఎల్‌ రాహుల్‌ వచ్చాడు.

చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి..
టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి చరిత్క సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో విరాట్‌ తన 50వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

తద్వారా ఈ అరుదైన ఘనతను తన పేరిట కోహ్లి లిఖించుకున్నాడు. 106 బంతుల్లో 8 ఫోర్లు,  ఒక సిక్స్‌తో సెంచరీ(106) సాధించాడు. టీమిండియా స్కోరు: 303-1(42)

శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ..
న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మిడిలార్డర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో అయ్యర్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 39 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 277/1. క్రీజులో కోహ్లి(93), అయ్యర్‌(54) పరుగులతో ఉన్నారు.

సెంచరీకి చేరువైన కోహ్లి
35.6: కోహ్లి 86 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

సెంచరీకి దిశగా కోహ్లి
కోహ్లి 78, అయ్యర్‌ 30 పరుగులతో నిలకడగా ఆడుతూ..  వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు.  33 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 238/1.

నిలకడగా ఆడుతున్న కోహ్లి, అయ్యర్‌
కోహ్లి 65, అయ్యర్‌ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 214-1
28 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 197-1
26.6: విరాట్‌ కోహ్లి అర్ధ శతకం
26.3: రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన శ్రేయస్‌ అయ్యర్‌

25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 178-1
కోహ్లి 45, అయ్యర్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

23: ఆబ్సెంట్‌ హర్ట్‌గా వెనుదిరిగిన శుబ్‌మన్‌ గిల్‌. క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌. టీమిండియా స్కోరు: 164-2
శాంట్నర్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ వేడిమికి తట్టుకోలేక ఇబ్బందిగా కదిలిన గిల్‌.. తొడ కండరాలు పట్టేయడంతో ఆబ్సెంట్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

కట్టుదిట్టంగా శాంట్నర్‌ బౌలింగ్‌
21: కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన శాంట్నర్‌.. కేవలం మూడు పరుగులు రాబట్టిన టీమిండియా.  స్కోరు: 153-1

20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 150/1
గిల్‌ 75, కోహ్లి 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 138/1
గిల్‌ 65, కోహ్లి 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న గిల్‌, కోహ్లి
 16వ ఓవర్‌ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 121-1

15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/1
గిల్‌ 52, కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

గిల్‌ హాఫ్‌ సెంచరీ
13.3: రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో ఫోర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్‌ గిల్‌. అంతర్జాతీయ వన్డేలో అతడికిది 13వ హాఫ్‌ సెంచరీ. 

12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 92-1
కోహ్లి 4, గిల్‌ 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
11 ఓవర్లలో టీమిండియా స్కోరు: 89-1

పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 84/1 (10)
9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 75-1

రోహిత్‌ అవుట్‌
8.2: రోహిత్‌ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. గిల్‌ 21, కోహ్లి క్రీజులో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీకి చేరువైన రోహిత్‌ (47)
8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 70/0 (8)

టీమిండియా ప్రస్తుత స్కోరు: 61/0 (7)
రోహిత్‌ శర్మ 47, గిల్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 6 ఓవర్లలో టీమిండియా స్కోరు: 58-0
క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ
వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌ రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 27 సిక్స్‌లు తన ఖాతాలో వేసుకుని వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. టీమిండియా స్కోరు: 47-0(5)

4 ఓవర్లలో టీమిండియా స్కోరు: 38/0
రోహిత్‌ 27, గిల్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
3.4: సౌథీ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన రోహిత్‌
3.3: సౌథీ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన రోహిత్‌
 

3 ఓవర్లలో టీమిండియా స్కోరు: 25-0
►2.3: టీమిండియా ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ నమోదు చేసిన  రోహిత్‌ శర్మ

2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 18-0
1.4: మరోసారి బౌండరీ బాదిన శుబ్‌మన్‌ గిల్‌
1.3: సౌథీ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌

►తొలి ఓవర్లో టీమిండియా స్కోరు: 10/0 (1)
0.5: రోహిత్‌ శర్మ ఖాతాలో మరో బౌండరీ
0.4: బౌల్ట్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన రోహిత్‌ శర్మ 

టాస్‌ గెలిచిన టీమిండియా
►టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వాంఖడేలో పిచ్‌ స్వభావాన్ని బట్టి భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌ చేయడం సానుకూలాంశంగా పరిణమించింది.

2019లో కూడా సెమీస్‌ ఆడాం
ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బాగుంది. కాబట్టి ముందుగా మేము బ్యాటింగ్‌ చేయాలనుకుంటున్నాం. 2019లో కూడా మేము సెమీస్‌ ఆడాం. న్యూజిలాండ్‌ నిలకడైన ఆట తీరుకు మారుపేరైన జట్లలో ఒకటి.

ఏదేమైనా ఇరు జట్లకు అత్యంత ముఖ్యమైన ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. మా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు’’ అని పేర్కొన్నాడు.

తుది జట్లు:
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్‌:
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్‌, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

పిచ్, వాతావరణం 
ఈ వరల్డ్‌ కప్‌లో వాంఖడే మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో అన్ని జట్లూ భారీ స్కోర్లు చేశాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో పేస్‌ బౌలింగ్‌కు పిచ్‌ అనుకూలిస్తోంది.

సెమీస్‌ ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకొని చూస్తే టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా సెమీస్‌కు రిజర్వ్‌ డే కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement