వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ ఆహ్వానం మెరకు ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.
దీంతో శ్రీలంక తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 58 పరుగులు వెనుకబడిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెస్‌వేల్ రెండు, డాగ్ బ్రెస్‌వేల్ , హెన్రీ తలా వికెట్ సాధించారు.
శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అంతకుముందు లంకేయులు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 164 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 584/4 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(215), హెన్రీ నికోల్స్(200) అద్భుతమైన డబుల్ సెంచరీలతో చెలరేగారు.
ఇక రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణించిన కేన్ విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. అదే విధంగా ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన నికోల్స్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వరించింది.
ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంక.. ఇప్పుడు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా లంక జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: IND vs AUS: మూడో వన్డేకు సూర్యకుమార్‌ను తప్పిస్తారా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment