
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్ బెర్త్‌ను కివీస్ దాదాపు ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు నాలుగో జట్టుగా కివీస్ అర్హత సాధించే ఛాన్స్ ఉంది. అయితే అఫ్గానిస్తాన్- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్యాచ్‌ల ఫలితాల తర్వాత సెమీస్‌కు వచ్చే నాలుగో జట్టు ఏదో అధికారికంగా తేలనుంది.
172 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్లు(45), రచిన్ రవీంద్ర(42) పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మిచెల్(43) పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. లంక బౌలర్లలో మాథ్యూస్ రెండు వికెట్లు సాధించగా.. థీక్షణ,చమీరా ఒక్క వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది.
బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్, శాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరెరా(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో థీక్షణ(38) పరుగులతో రాణించాడు.
చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. సచిన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment