శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ టెస్ట్ క్రికెట్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. కమిందు టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ అరంగేట్రం నుంచి ఇన్ని మ్యాచ్‌ల్లో వరుసగా 50 ప్లస్ స్కోర్‌లు చేయలేదు. పాక్ ఆటగాడు సౌద్ షకీల్ అరంగేట్రం నుంచి వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఆతర్వాత న్యూజిలాండ్ ఆటగాడు బెర్ట్ సచ్‌క్లిఫ్, పాక్‌కు చెందిన సయీద్ అహ్మద్, భారత్‌కు చెందిన సునీల్ గవాస్కర్ అరంగేట్రం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు.
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది.
దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.
టెస్ట్ అరంగేట్రం నుంచి ఎనిమిది మ్యాచ్‌ల్లో కమిందు చేసిన స్కోర్లు..
- 61 vs AUS.
- 102 & 164 vs BAN.
- 92* vs BAN.
- 113 vs ENG.
- 74 vs ENG.
- 64 vs ENG.
- 114 vs NZ.
- 51* vs NZ.
చదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..!
Comments
Please login to add a commentAdd a comment