WC 2023: వన్డే వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆటగాళ్లు.. 10 జట్ల పూర్తి వివరాలివే | Squads Of All 10 Teams Are Confirmed For ICC Men's Cricket World Cup 2023; Check Details - Sakshi
Sakshi News home page

WC Final Squads: వన్డే వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆటగాళ్లు.. 10 జట్ల పూర్తి వివరాలివే

Published Sat, Sep 30 2023 3:27 PM | Last Updated on Tue, Oct 3 2023 7:50 PM

10 Final Squads Confirmed for ICC Mens Cricket World Cup 2023 Check - Sakshi

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలివే (PC: ICC )

ICC ODI World Cup 2023 All Final Squads: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత్‌ వేదికగా అక్టోబరు 5న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మధ్య పోరుతో మెగా క్రికెట్‌ సమరానికి తెరలేవనుంది. 

పుష్కరకాలం తర్వాత భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా సహా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌.. మొత్తంగా పది జట్లు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచే వామప్‌ మ్యాచ్‌లు కూడా మొదలైపోయాయి.

ఈ నేపథ్యంలో రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే వరల్డ్‌కప్‌-2023 కోసం ఆయా మేనేజ్‌మెంట్లు ఖరారు చేసిన ఫైనల్‌ టీమ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్.

పాకిస్తాన్‌:
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్‌, హసన్ అలీ, షాహిన్‌ ఆఫ్రిది, మహ్మద్ వసీం.

అఫ్గనిస్తాన్‌
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా జుర్మతి, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ ఇసాఖిల్, ఇక్రమ్ అలీ ఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ అర్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లకన్వాల్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్ రహ్మానీ, నవీన్ ఉల్ హక్ మురీద్.

ఆస్ట్రేలియా
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

బంగ్లాదేశ్‌
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ కుమర్ దాస్, తన్జిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తవ్హిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసూమ్ అహ్మద్, షేక్ మహేదీ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్. 

ఇంగ్లండ్‌
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్‌, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.

నెదర్లాండ్స్‌
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లెయిన్, వెస్లీ బారెసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్. 

న్యూజిలాండ్‌
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్‌, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్‌ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. 

సౌతాఫ్రికా
తెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ఎయిడెన్‌ మార్కరమ్‌, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, తబ్రేజ్‌ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్.

శ్రీలంక
దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీషా పతిరానా, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక.

చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కావొచ్చు: టీమిండియా స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement