సెప్టెంబర్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రకటించారు. ఈ సిరీస్‌లో ధనంజయ డిసిల్వ శ్రీలంకను లీడ్ చేయనున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ ఒషాడా ఫెర్నాండో చాలాకాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, కుసాల్ మెండిస్ వంటి సీనియర్ సభ్యులు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల కలయికగా ఉంది. సీనియర్లతో పాటు యువ సంచలనాలు పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ తిరిగి జట్టులోకి వచ్చారు.
బౌలింగ్ విషయానికొస్తే.. ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్‌ల కాంబినేషన్‌తో ఈ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. వీరితో పాటు పేస్ బౌలర్లు అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.
న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక జట్టు..
ధనంజయ డిసిల్వా (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండీమల్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఒషాడా ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయక్
శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
సెప్టెంబర్ 18-23 వరకు తొలి టెస్ట్ (గాలే)
సెప్టెంబర్ 26-30 వరకు రెండో టెస్ట్ (గాలే)
ఇదిలా ఉంటే, శ్రీలంక ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో శ్రీలంక ఓడినా చివరి టెస్ట్‌లో అద్భుత విజయం సాధించింది. ఈ సిరీస్‌తో పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ స్టార్లుగా మారిపోయారు. న్యూజిలాండ్ సిరీస్‌లో శ్రీలంక వీరిద్దరి ప్రదర్శనపై ఆధారపడి ఉంది. స్వదేశంలో ఆడుతున్న సిరీస్ కావడంతో నిస్సంక, కమిందు మ్యాచ్ విన్నర్లుగా మారవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment