మేము కూడా ముందు బౌలింగ్‌ చేయాలనుకున్నాం.. కానీ! స్టోక్స్‌కు: బట్లర్‌ | ODI WC 2023 NZ vs ENG: Jos buttler comments in toss time | Sakshi
Sakshi News home page

మేము కూడా ముందు బౌలింగ్‌ చేయాలనుకున్నాం.. కానీ! స్టోక్స్‌కు: బట్లర్‌

Published Thu, Oct 5 2023 2:15 PM | Last Updated on Thu, Oct 5 2023 2:24 PM

ODI WC 2023 NZ vs ENG: Jos buttler comments in toss time - Sakshi

క్రికెట్‌లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌-2023 ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్- న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ తొలుత ఇంగ్లడ్‌ను బ్యాటింగ్‌ అహ్హనించాడు. తొలి మ్యాచ్‌కు కేన్‌ విలియమ్సన్‌ దూరం కావడంతో లాథమ్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు.

అదే విధంగా ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ దూరమయ్యాడు. స్టోక్స్‌ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని టాస్‌ సందర్భంగా జోస్‌ బట్లర్‌ తెలిపాడు.బట్లర్‌ మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై మాకు కూడా ముందు బౌలింగ్‌ చేయాలని ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్‌ వికెట్‌ వికెట్‌ చాలా బాగుంది.

ఇక టోర్నీకి అన్ని విధాల సన్నద్దమయ్యాం. అదేవిధంగా మా సొంత గడ్డపై న్యూజిలాండ్‌ను వన్డే సిరీస్‌లో ఓడించాం. కాగా ఈ మ్యాచ్‌కు బెన్‌ స్టోక్స్‌ దూరమయ్యాడు. స్టోక్స్‌ తుంటి గాయంతో బాధపడుతున్నాడు. స్టోక్స్‌తో పాటు టోప్లీ, విల్లీ, అటిక్సన్‌ దూరమయ్యారు. చివరగా ఈ టోర్నమెంట్‌ కోసం ఎంతో అతృతగా మేము ఎదురుచూశమని పేర్కొన్నాడు.
తుది జట్లు:
న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్

ఇంగ్లండ్‌
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్‌, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

చదవండి: Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! ఇదేం ప్రశ్న? నవ్వు ఆపుకొన్న బట్లర్‌! వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement