లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. రూట్ 170 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. విజయానికి 61పరుగులు కావాల్సిన నేపథ్యంలో నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది.
రూట్‌తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ 54, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 32 పరుగులతో రాణించారు. రూట్, ఫోక్స్ కలిసి 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేయడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 132 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ సైతం 141పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కోలుకున్న న్యూజిలాండ్ 285పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డార్లీ మిచెల్ 108,టామ్ బ్లండెల్ 96 పరుగులతో రాణించారు.
అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ పేసర్ కైలీ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటర్లకు చక్కులు చూపించాడు. ఈ దశలో రూట్, స్టోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక స్టోక్స్ ఔటయ్యక రూట్..ఫోక్స్‌తో కలిసి ఇంగ్లండ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
చదవండి: IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..!
Comments
Please login to add a commentAdd a comment