ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే వరల్డ్‌కప్-2023కు తెరలేచింది. భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీ ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది.
ఇంగ్లండ్‌కు షాక్.. స్టోక్స్ లేకుండానే
టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక 2019 వరల్డ్‌కప్ హీరో బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లండ్.. కివీస్‌తో బరిలోకి దిగనుంది. గాయం వేధిస్తున్న క్రమంలో అతడు జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ.
వాళ్లు ముగ్గురూ మిస్
కాగా కొన్నాళ్ల క్రితం 50 ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. ఇంగ్లండ్ బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ న్యూజిలాండ్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా.. లాథమ్ మాట్లాడుతూ.. ‘‘టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం.
పిచ్ బాగుంది. పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకుంటున్నాం. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. దురదృష్టవశాత్తూ కేన్ ఇంకా మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాలేదు. ఫెర్గూసన్‌ని గాయం వేధిస్తోంది. ఇష్ సోధి, కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ ఈరోజు మిస్సయ్యారు’’ అని పేర్కొన్నాడు.
తుది జట్లు:
న్యూజిలాండ్
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్
ఇంగ్లండ్
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment