టెస్టుల్లో జో రూట్‌ అరుదైన ఫీట్‌.. కుక్‌ రికార్డు సమం..! | Root youngest to 10,000 Test runs, equals Cooks record | Sakshi
Sakshi News home page

ENG vs NZ: టెస్టుల్లో జో రూట్‌ అరుదైన ఫీట్‌.. కుక్‌ రికార్డు సమం..!

Published Sun, Jun 5 2022 6:51 PM | Last Updated on Sun, Jun 5 2022 8:31 PM

Root youngest to 10,000 Test runs, equals Cooks record - Sakshi

లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ ఆటగాడిగా రూట్‌ రికార్డులకెక్కాడు.

అదే విధంగా టెస్టుల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్న అలెస్టర్ కుక్ రికార్డును రూట్‌ సమం చేశాడు. అలెస్టర్ కుక్ తర్వాత 10,000 పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్‌ ఆటగాడిగా రూట్‌ నిలిచాడు.

జట్ల స్కోర్‌లు : 
న్యూజిలాండ్  తొలి ఇన్నింగ్స్ : 132 ఆలౌట్ 
ఇంగ్లాండ్  తొలి ఇన్నింగ్స్ : 141 ఆలౌట్ 
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 285 ఆలౌట్ 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 279-5
చదవండి: ENG vs NZ: సెంచరీతో చెలరేగిన జో రూట్‌.. లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement