
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(PC: ECB)
India Vs England 5Th Test: సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను 3–0తో వైట్‌వాష్ చేసిన ఇంగ్లండ్ ఇదే దూకుడును భారత్‌పైనా కొనసాగిస్తామని ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ అన్నాడు. ‘కివీస్‌పై ఎలాగైతే ఆడామో భారత్‌తోనూ అలాగే ఆడతాం. ప్రత్యర్థి మారినా మా దూకుడు మైండ్‌సెట్ మారదు.
గత మూడు టెస్టుల్లో కనబరిచిన ఏకాగ్రతనే తదుపరి మ్యాచ్‌లోనూ కొనసాగిస్తాం. పట్టు సడలించం. అలసత్వం వహించం’ అని స్టోక్స్ చెప్పాడు. భారత్, ఇంగ్లండ్‌ల టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో శుక్రవారం నుంచి జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్ చేరుకుని, ఒక ప్రాక్టీసు మ్యాచ్ కూడా ముగించుకుంది.
కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను స్టోక్స్ బృందం వైట్‌వాష్ చేసింది. ఇక కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అపూర్వ విజయం అందుకోవడంతో స్టోక్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే విధంగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ సైతం ఈ సిరీస్‌తోనే ఇంగ్లండ్ కోచ్‌గా ప్రయాణం ఆరంభించడం విశేషం.
చదవండి: Deepak Hooda: దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా
What a week! 🏏
— England Cricket (@englandcricket) June 28, 2022
We wrap up the series whitewash in Leeds! 👏
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/9uLmp8eu73
Comments
Please login to add a commentAdd a comment