
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు సాధించింది. టామ్ లాథమ్ (76; 12 ఫోర్లు), విలియమ్సన్ (48; 8 ఫోర్లు) రాణించారు. డరైల్ మిచెల్ (4 బ్యాటింగ్), బ్లన్‌డెల్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 137 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 67 ఓవర్లలో 360 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్టు ఆడుతున్న జేమ్స్ ఓవర్టన్ (97; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. బెయిర్‌స్టో (157 బంతుల్లో 162; 24 ఫోర్లు), స్టువర్ట్ బ్రాడ్ (36 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు, టిమ్ సౌతీ మూడు, నీల్ వాగ్నర్ రెండు వికెట్లు తీశారు.
చదవండి: IND vs LEI: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. స్కోర్: 364/9