
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136) చెలరేగడంతో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో చేజిక్కించుకుంది.
ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలుపుకు 74.3 ఓవర్లలో 299 రన్స్ చేయాల్సి ఉండగా.. బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75 నాటౌట్), బెయిర్‌స్టో వేగంగా పరుగులు సాధించి, కేవలం 50 ఓవర్లలోనే జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఇంగ్లండ్ ధీటుగా బదులిచ్చి 539 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌కు 299 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది.
చదవండి: దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ ఆడనివ్వను.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు