Eng Vs NZ: Joe Root Produced Magic With His Bat To Take England To Victory, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Joe Root Viral Video: వామ్మో.. ఇదేంటి? రూట్‌ నీకు చేతబడి తెలుసా? అదేం కాదు బ్రో.. వైరల్‌!

Published Mon, Jun 6 2022 1:03 PM | Last Updated on Mon, Jun 6 2022 3:40 PM

Eng Vs NZ: Joe Root His Seemingly Levitating Bat Gone Viral What Is This Sorcery - Sakshi

నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో రూట్‌(PC: SonyLIV/ Tweeted By Ben Joseph)

England Vs New Zealand 1st Test: ఇంగ్లండ్‌ టెస్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘రూట్‌ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ అని తెలుసు. కానీ ఇలా మ్యాజిక్‌ చేస్తాడని తెలియదు. ఇదేదో చేతబడిలా ఉంది. మాకు కూడా చెప్పవా?’’ అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఇందులో జో రూట్‌ అద్భుత అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

తద్వారా ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. పర్యాటక న్యూజిలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక ఈ మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో 10 వేల పరుగుల మార్కును అందుకున్నాడు.

ఇదిలా ఉంటే.. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో రూట్‌ నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న సమయంలో బ్యాట్‌ను వదిలి నిలబడ్డాడు. అదేంటో బ్యాట్‌ ఏమాత్రం తొణక్కుండా అలాగే నిల్చున్నట్లుగా కనిపించింది. ఇక పరుగు తీసే క్రమంలో బ్యాట్‌ను చేతబట్టి ఎప్పటిలాగే ముందుకు సాగాడు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. దీంతో రూట్‌ ఏదో మ్యాజిక్‌ చేశాడంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. రూట్‌ బ్యాట్‌ బాటమ్‌ ఫ్లాట్‌గా ఉండి ఉంటుంది.. అంతేగానీ అందులో మాయాజాలం ఏమీ లేదంటూ సమాధానం చెబుతున్నారు. 

చదవండి👉🏾Kohli- Rohit- Rahul: పేరు ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు ఆడాలి: భారత దిగ్గజం ఘాటు విమర్శలు
Test Cricket: రూట్‌ త్వరలోనే సచిన్‌ రికార్డు బద్దలు కొడతాడు: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement