
హామిల్టన్:వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక మెరుపు క్యాచ్‌తో బౌల్ట్ అభిమానుల్ని విస్మయానికి గురిచేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ ఆడే క్రమంలో 13 ఓవర్ ను అందుకున్న బౌల్ట్.. మూడో బంతికి విండీస్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మేర్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను గాల్లోకి డైవ్ కొట్టి అద్బుతంగా పట్టుకున్నాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు రిటర్న్ క్యాచ్‌లను అందుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. అయితే బౌల్ట్ మాత్రం ఎటువంటి తప్పిదం చేయకుండా ఒంటి చేత్తో క్యాచ్‌ను అందుకుని శభాష్ అనిపించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంచితే, ఈ టెస్టు మ్యాచ్‌లో విండీస్ పోరాడుతోంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆటలో విండీస్ తన రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కీరన్ పావెల్(0), హెట్‌మేర్(15)లు పెవిలియన్‌కు చేరారు. ఆట ముగిసే సమయానికి క్రెయిగ్ బ్రాత్‌వైట్(13 బ్యాటింగ్), షాయ్ హోప్(1 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు 215/8 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 221 పరుగులకు ఆలౌటైంది. ఆపై న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను 291/8 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో న్యూజిలాండ్‌కు 443 పరుగుల ఆధిక్యం లభించింది.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 221 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 373 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 291/8 డిక్లేర్
వారెవ్వా.. వాటే సెన్సేషనల్ క్యాచ్