
హామిల్టన్: ఆతిథ్య న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా నాలుగో వన్డే బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. భారత జట్టు 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో రోహిత్ సేన కనీసం గౌరవప్రదమైన స్కోర్ అయినా సాధించడం కష్టంగా మారింది. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా(0), భువనేశ్వర్(0) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు.
కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ(6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కష్టకాలంలో బాధ్యతాయుతంగా ఆడతాడని భావించిన జాదవ్(1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment