వారెవ్వా సకిబ్‌.. నాలుగు ఓవర్లు.. 7 పరుగులు! 4 వికెట్లు | Tanzim Hasan Surpasses Trent Boult To Set This Unique Record In T20 WC | Sakshi
Sakshi News home page

T20 WC 2024: వారెవ్వా సకిబ్‌.. నాలుగు ఓవర్లు.. 7 పరుగులు! 4 వికెట్లు

Published Mon, Jun 17 2024 2:26 PM | Last Updated on Mon, Jun 17 2024 2:59 PM

Tanzim Hasan Surpasses Trent Boult To Sets This Unique Record In T20 WC

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెయింట్‌ లూసియా వేదికగా  నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. దీంతో బంగ్లా జట్టు తమ సూపర్‌-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా బంగ్లా విజయంలో ఆ జట్టు యువ పేసర్‌  తంజిమ్ హసన్ షకిబ్‌ది కీలక పాత్ర. 

ఈ మ్యాచ్‌లో తంజిమ్ హసన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన పేస్‌ బౌలింగ్‌తో నేపాల్‌ బ్యాటర్లకు తంజిమ్‌ చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్‌ దాటికి నేపాల్‌ పట్టుమని పదినిమిషాలు క్రీజులో నిలబడలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో తంజిమ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ కోటాలో రెండు మెయిడిన్‌ ఓవర్లు ఉండడం గమనార్హం. దీంతో బంగ్లాదేశ్‌ 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకోగలిగింది. 

ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తంజిమ్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక డాట్‌బాల్స్‌ వేసిన బౌలర్‌గా సకిబ్‌ రికార్డులకెక్కాడు. 

ఈ మ్యాచ్‌లో సకిబ్‌ 21 డాట్‌ బాల్స్‌ వేశాడు. ఇంతకుముందు ఈ రి​కార్డు న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ పేరిట ఉండేది. బౌల్డ్‌ 20 డాట్‌బాల్స్‌ వేశాడు. తాజా మ్యాచ్‌తో బౌల్ట్‌ అల్‌టైమ్‌ రికార్డును సకిబ్‌ బ్రేక్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement