
దక్షిణాఫ్రికాపై తొలి టెస్ట్‌లో విజయం సాధించి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఓవల్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. "ట్రెంట్ బౌల్ట్ రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అతడు గత కొద్ది కాలంగా విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి ఫిట్‌నెస్ దృష్ట్యా విశ్రాంతి ఇవ్వాలని భావించాం అని కోచ్ స్టెడ్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఇన్నిగ్స్ అండ్ 276 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ మాట్ హెన్రీ 7 వికెట్లు పడగొట్టి ప్రొటీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లోను హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ICC T20I Rankings: ఆరేళ్ల తర్వాత ఇదే తొలి సారి.. రెండో కెప్టెన్‌గా రోహిత్
Comments
Please login to add a commentAdd a comment