స్వదేశంలో టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు కేన్ విలియమన్స్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా సీనియర్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, మార్టిన్ గప్టిల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు యువ ఆటగాడు ఫిన్ అలెన్‌కు వన్డే, టీ20 జట్ల రెండింటిలోనూ చోటు దక్కింది.
అదే విధంగా గత కొంత కాలంగా వన్డే జట్టుకు దూరంగా ఉన్న ఆడమ్ మిల్నే తిరిగి టీమిండియా సిరీస్‌లో పునరాగమనం చేయనున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న వెటరన్ పేసర్ మాట్ హెన్రీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.
కాగా ఈ హోమ్ సిరీస్‌లో భాగంగా టీమిండియాతో న్యూజిలాండ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20)
Our squads to face India in three T20I's & three ODI's starting on Friday at @skystadium 🏏
— BLACKCAPS (@BLACKCAPS) November 14, 2022
Details | https://t.co/OTHyEBgKxQ#NZvIND pic.twitter.com/2Ov3WgRJJt
Comments
Please login to add a commentAdd a comment