బెంగళూరు వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమైంది. ఆక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.
అయితే సెకెండ్ టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ కేన్ విలియమన్స్ పుణే టెస్టుకు కూడా దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న విలియమ్సన్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.
గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విలియమ్సన్‌కు తొడ కండరాలు పట్టేశాయి. అప్పటి నుంచి కేన్ మామ ఆటకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న ఈ కివీ స్టార్ బ్యాటర్ శరవేగంగా కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని బ్లాక్ క్యాప్స్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు.
"కేన్ విలియమ్సన్ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు బాగానే కోలుకుంటున్నాడు. కానీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. కేన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను" అని స్టెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక కివీస్ తొలి టెస్టులో ఆడిన జట్టునే పుణే టెస్టుకూ కొనసాగించే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs NZ: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment