ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అంతర్జాతీయ వన్డేల్లో చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా.. బంగ్లా క్రికెటర్ తౌహిద్ హృదోయ్ వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు.
కాగా చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్ అటాకింగ్ ఆరంభించిన ఫాస్ట్‌బౌలర్ బౌల్ట్.. ఇన్నింగ్స్ తొలి బంతికే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు.
షకీబ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అదరగొట్టిన ముష్షికర్, మహ్మదుల్లా
ఆరంభంలోనే ఇలా షాకిచ్చినప్పటికీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(40), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం(66) బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరితో పాటు.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మదుల్లా 41 పరుగులతో రాణించాడు.
ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. వీరి ముగ్గురి నిలకడైన ఆట కారణంగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే.. ఆరంభంలో లిటన్ దాస్ వికెట్ తీసిన ట్రెంట్ బౌల్ట్.. 37.5వ ఓవరల్లో తౌహిద్‌ను నకుల్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన తౌహిద్.. బాల్‌ను గాల్లోకి లేపగా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ సాంట్నర్ ఒడిసిపట్టాడు.
చరిత్ర సృష్టించిన బౌల్ట్.. వన్డేల్లో తొలి కివీస్ బౌలర్‌గా ఘనత
కాగా అంతర్జాతీయ వన్డేల్లో బౌల్ట్‌కు ఇది 200వ వికెట్. ఈ క్రమంలో తక్కువ మ్యాచ్‌లలోనే 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ మైలురాయిని చేర్చుకున్న కివీస్ తొలి బౌలర్‌గా బౌల్ట్ చరిత్ర సృష్టించాడు.
ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా.. అంతర్జాతీయ వన్డే హిస్టరీలో తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
తక్కువ మ్యాచ్‌లలోనే అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు
►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 102
►సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్)- 104
►ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్)- 107
►బ్రెట్ లీ(ఆస్ట్రేలియా)- 112
►అలెన్ డొనాల్డ్(సౌతాఫ్రికా)- 117
వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని తక్కువ బంతుల్లో అందుకున్నది వీళ్లే
►మిచెల్ స్టార్క్- 5240
►సక్లెయిన్ ముస్తాక్- 5451
►బ్రెట్ లీ- 5640
►ట్రెంట్ బౌల్ట్- 5783
చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
Comments
Please login to add a commentAdd a comment