PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. రాజస్తాన్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్తాన్ విజయం సాధిస్తే..శాంసన్ సేన ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తోంది. అయితే రాజస్తాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తమ తదపరి మ్యాచ్‌ల్లో ఓటమి చెందితే.. ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి.
అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకమవుతోంది. అయితే ముంబై, ఆర్సీబీ కంటే రాజస్తాన్(+0.140) నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించే ఛాన్స్ ఉంటుంది. ఇక పంజాబ్‌కు కూడా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెథ్యమేటిక్‌గా ఉన్నాయి.
పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా రాజస్తాన్‌పై భారీ విజయం సాధించాలి. అంతే కాకుండా ముంబై, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ ఓటమి పాలవ్వాలి. అప్పుడు ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమమవుతాయి. అప్పుడు నెట్‌రన్‌ను పరిగణలోకి తీసుకుంటారు.
ట్రెంట్ బౌల్ట్ ఎంట్రీ.. జంపా ఔట్
ఇక పంజాబ్‌తో కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ తమ జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పంజాబ్‌తో పోరుకు తిరిగి జట్టులోకి రానున్నట్లు సమాచారం. బౌల్ట్ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్ ఆడమ్ జంపా బెంచ్‌కే పరిమితమయమ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌పై రాజస్తాన్ మెనెజెమెంట్ మరోసారి నమ్మకం ఉంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజస్తాన్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్( కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
చదవండి: IPL 2023 Playoffs: ఓటమి వ్యత్యాసం కూడా కీలకమే.. రాజస్తాన్ ఆ విషయం మర్చిపోయినట్టుంది!
Comments
Please login to add a commentAdd a comment