ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ విజయం సాధించింది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. యశస్వి జైశ్వాల్ 50, దేవదత్ పడిక్కల్ 51, షిమ్రోన్ హెట్‌మైర్ 46 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా.. సామ్ కర్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ తలా ఒక వికెట్ తీశారు.
జైశ్వాల్(50)ఔట్.. రాజస్తాన్ 149/4
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఐదో అర్థసెంచరీ సాధించిన జైశ్వాల్(50 పరుగులు) నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో రిషి దవన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 16 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. హెట్‌మైర్ 32, రియాన్ పరాగ్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 24 బంతుల్లో 39 పరుగులు కావాలి.
14 ఓవర్లలో రాజస్తాన్ 134/3
14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జైశ్వాల్ 49, హెట్‌మైర్ 27 పరుగులతో ఆడుతున్నారు.
శాంసన్(2) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో రిషి ధవన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు అర్థసెంచరీతో రాణించిన పడిక్కల్(51 పరుగులు) అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.
టార్గెట్ 188.. 7 ఓవర్లలో రాజస్తాన్ 61/1
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. జైశ్వాల్ 25, పడిక్కల్ 39 పరుగులతో ఆడుతున్నారు.
రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 188
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సామ్ కరన్ 31 బంతుల్లో 49 నాటౌట్, షారుక్ ఖాన్ 23 బంతుల్లో 41 నాటౌట్, జితేశ్ శర్మ 28 బంతుల్లో 44 పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో నవదీప్ సైనీ మూడు వికెట్లు తీయగా.. బౌల్ట్, జంపాలు తలా ఒక వికెట్ పడగొట్టారు.
జితేశ్ శర్మ(44)ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
44 పరుగులు చేసిన జితేశ్ శర్మ నవదీప్ సైనీ బౌలింగ్‌లో ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. సామ్ కరన్ 18, షారుక్ ఖాన్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 78/4
10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 20, సామ్ కరన్ 8 పరుగులతో ఆడుతున్నారు.
మూడో వికెట్ డౌన్.. పంజాబ్ కింగ్స్ 46/2
17 పరుగులు చేసిన శిఖర్ ధావన్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 46 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ధావన్ 17, లివింగ్‌స్టోన్ 6 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 3 ఓవర్లలో 30/1
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో ప్రభ్‌సిమ్రన్ సింగ్(2 పరుగులు) బౌల్ట్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. ధావన్ 16, అథర్వ టైడే 11 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం(మే 19న) ధర్మశాల వేదికగా 66వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
Sanju Samson wins the all-important 🪙 toss & @rajasthanroyals will BOWL FIRST in the crunch clash at Dharamsala.
Watch #PBKSvRR, LIVE & FREE on #JioCinema, available on any sim card.#IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/PiCJWLuIi6
— JioCinema (@JioCinema) May 19, 2023
ఇవాళ లీగ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ రాయల్స్ గెలిస్తేనే ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తన ప్లే ఆఫ్ అవకాశాలను చేజార్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment