ఆక్లాండ్: యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10 వరకు జరిగే ఐపీఎల్ 2021 రెండో అంచెలో పాల్గొనేందుకు తమ క్రికెటర్లకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో విలియమ్సన్ (సన్‌రైజర్స్), బౌల్ట్ (ముంబై ఇండియన్స్), జేమీసన్ (బెంగళూరు), సాట్నర్ (చెనై సూపర్ కింగ్స్) తరఫున బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి ఐపీఎల్ జరిగే సమయంలో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్... పాకిస్తాన్‌తో మూడు వన్డేలతో పాటు ఐదు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
అయితే ఈ సిరీస్‌ల నుంచి ఐపీఎల్‌లో ఆడే ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. అంతేకాకుండా టి20 ప్రపంచకప్, భారత్‌తో జరిగే టి20 సిరీస్‌ల కోసం కేన్ విలియమ్సన్ నాయకత్వంలో ఒక జట్టును... బంగ్లాదేశ్, పాక్‌లతో ఆడేందుకు టామ్ లాథమ్ సారథ్యంలో మరొక జట్టును ప్రకటించారు. టి20 ప్రపంచకప్, భారత్‌తో జరిగే టి20 సిరీస్ లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టు: విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్టల్, బౌల్ట్, చాప్‌మన్, కాన్వే, ఫెర్గూసన్, గప్టిల్, జేమీసన్, డరైల్ మిచెల్, నీషమ్, ఫెలిప్స్, సాన్‌ట్నెర్, సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే (రిజర్వ్ ప్లేయర్).
Comments
Please login to add a commentAdd a comment