
హామిల్టన్: టీమిండియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన న్యూజిలాండ్ ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ రీఎంట్రీ షురూ అయ్యింది. ఈనెల 21వ తేదీ నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు బౌల్ట్ అందుబాటులోకి వచ్చాడు. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో బౌల్ట్ పునరాగమనం ఖాయమైంది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రకటించిన టెస్టు జట్టులో బౌల్ట్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో చేతికి తీవ్ర గాయం కావడంతో బౌల్ట్ వరుస సిరీస్‌లకు దూరం కావాల్సి వచ్చింది.
ఆ క్రమంలోనే టీమిండియా జరిగిన ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌లో సైతం బౌల్ట్ ఆడలేదు. కాగా, రెండు టెస్టుల సిరీస్‌లో బౌల్ట్ చోటు దక్కించుకోవడంతో కివీస్ పేస్ బలం మరింత పెరిగింది. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ అయిన కివీస్.. వన్డే సిరీస్‌లో జూలు విదిల్చింది. ఫలితంగా టీమిండియాను వైట్‌వాష్ చేసింది. ఇక టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల బలంగా ఉండటంతో హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ టెస్టు జట్టు ఇదే..
కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, గ్రాండ్ హోమ్, జెమీసన్, ట్రెంట్ బౌల్ట్, టామ్ లాథమ్, డార్లీ మిచెల్, హెన్రీ నికోలస్, అజాజ్ పాటేల్, టిమ్ సౌతీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, వాట్లింగ్
Comments
Please login to add a commentAdd a comment