కివీస్‌ సిరీస్‌ల రికార్డు  | New Zealand win by second test in Christchurch | Sakshi
Sakshi News home page

కివీస్‌ సిరీస్‌ల రికార్డు 

Published Mon, Dec 31 2018 4:15 AM | Last Updated on Mon, Dec 31 2018 4:15 AM

New Zealand win by second test in Christchurch - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: శ్రీలంకతో జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్‌ 423 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ఈ ఏడాది కివీస్‌ చేజిక్కించుకున్న నాలుగో సిరీస్‌ ఇది. దీంతో 88 ఏళ్ల న్యూజిలాండ్‌ టెస్టు చరిత్రలో తొలిసారి వరుసగా నాలుగు సిరీస్‌లు సొంతం చేసుకొని కొత్త రికార్డు సృష్టించింది. చివరి రోజు 14 బంతుల వ్యవధిలోనే ట్రెంట్‌ బౌల్ట్‌ (3/77), వాగ్నర్‌ (4/48) మూడు వికెట్లను పడగొట్టి లంక ఇన్నింగ్స్‌కు తెరదించారు. 231/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక 236 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధసెంచరీ చేసిన సౌతీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే వచ్చే నెల 3న మౌంట్‌ మాంగనిలో జరుగుతుంది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement