న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ మారాడు. వచ్చే సీజన్ కోసం అతను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు మారాడు. ఐపీఎల్–12వ సీజన్‌కు సంబంధించిన మార్పులు, చేర్పులకు నేటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫ్రాంచైజీ కివీస్ పేసర్‌ను విడుదల చేయడంతో ముంబై అతన్ని తీసుకుంది. 2014లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బౌల్ట్ రెండు సీజన్ల (2018, 2019)పాటు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌లో 33 మ్యాచ్‌లాడిన అతను 38 వికెట్లు తీశాడు. దేశవాళీ సీమర్ అంకిత్ రాజ్‌పుత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి రాజస్తాన్ రాయల్స్ పంచన చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment