
అబుదాబి : ఎడారి దేశం యూఏఈలో ప్రస్తుతం సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు వచ్చిన న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ స్వస్థలంలో ప్రస్తుతం శీతాకాలం అదీ 7–8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. తనకు సంబంధించి వాతావరణంలో ఈ తేడానే పెద్ద సవాల్ విసురుతోందని బౌల్ట్ అన్నాడు. ఇలాంటి చోట బౌలింగ్ చేయడం అంత సులువు కాదని అతను అభిప్రాయపడ్డాడు. లసిత్ మలింగ గైర్హాజరులో ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్‌గా బౌల్ట్‌పై మరింత బాధ్యత పెరిగింది. (చదవండి : ఇప్పటికీ ఆయనే బెస్ట్ ఫినిషర్: మిల్లర్)
‘యూఏఈలో ఉష్ణోగ్రతలకు అలవాటు పడటమే కొంత ఇబ్బందిగా మారింది. అది అంత సులువు కాదు. అయితే ప్రాక్టీస్ మాత్రం బాగానే కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇందులో చాలా మందికి మంచి అనుభవం ఉండటం జట్టు పనిని సులువు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన పలువురు ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్‌లో బౌలర్‌గా ఉండటం నాకు సానుకూలాంశం. టోరీ్నలో పిచ్‌లు బాగుండాలని కోరుకుంటున్నా. అప్పుడు బౌలర్‌గా సత్తా చాటేందుకు మంచి అవకాశం లభిస్తుంది’ అని బౌల్ట్ అభిప్రాయపడ్డాడు.
నెట్ బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్!
ఈ ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్లలో ఒకడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం అర్జున్ అబుదాబిలో ముంబై జట్టు వెంట ఉన్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో సేదదీరుతున్న ఫొటోను అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment