
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టించిన హెడ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా అదే దూకుడును కనబరుస్తున్నాడు.
సౌత్ంప్టాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.
కుర్రాన్‌ను ఊతికారేసిన ట్రావిస్..
ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ సామ్ కుర్రాన్‌ను హెడ్ ఊతికారేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన కుర్రాన్ బౌలింగ్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో హెడ్ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. తొలి రెండు బంతులని బౌండరీలు బాదిన హెడ్.. ఆ తర్వాత మూడు బంతులను హ్యాట్రిక్ సిక్సర్లగా మలిచాడు. చివరి బంతికి మళ్లీ ఫోర్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
హెడ్ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో సామ్ కుర్రాన్‌కు చుక్కలు చూపించిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్ల సరసన నిలిచాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్, డానియల్ క్రిష్టియన్, ఫించ్, మిచెల్ మార్ష్ ఒకే ఓవర్‌లో 30 పరుగులు బాదారు.
చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే జట్టులో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం?
6️⃣6️⃣6️⃣: Number of the batting beast, i.e. Travis Head 🔥
The explosive Aussie opener hit 30 runs off a Sam Curran over, including 3 successive sixes! #RivalsForever #ENGvAUSonFanCode pic.twitter.com/R6Bac6Sd6R— FanCode (@FanCode) September 11, 2024