
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
భారీ లక్ష్య చేధనలో కంగారుల ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్స్‌లతో 154 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో మార్నస్ లబుషేన్(77) పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో పొట్స్, బెతల్, లివింగ్‌స్టోన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.

బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా...విల్ జాక్స్ (56 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెపె్టన్ హ్యారీ బ్రూక్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో లబుషేన్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా...ట్రవిస్ హెడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం లీడ్స్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment