ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించారు. బుధవారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
వీరిద్దరి తుపాన్ ఇన్నింగ్స్‌ల ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలో చేధించింది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆజేయంగా నిలిచి సన్‌రైజర్స్‌కు రికార్డు విజయాన్ని అందించాడు.
ఈ క్రమంలో వీరిద్దరి బ్యాటింగ్‌కు సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం సైతం ఫిదా అయిపోయాడు. ఎక్స్ వేదికగా ఈ ఓపెనింగ్ జోడీపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఉప్పల్‌లో ఈ రోజు విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని చూశాం. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే.. తప్పకుండా ‘300’ స్కోరు చూసేవాళ్లమే’’ అని సచిన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు.
ఈ విధ్వంసకర జోడీను ప్రశంసిస్తూ భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌లో హెడ్, అభిషేక్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఎంత చెప్పుకున్న తక్కువే. అదే జోరులో 300 పరుగులైనా ఛేజ్ చేసేవాళ్లు అని ఎక్స్‌లో మిథాలీ రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment