ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది.
ఛేదనలో ఆస్ట్రేలియా స్కోర్ 165/2 (20.4 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ ఇంగ్లండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉంది.
డకెట్ సెంచరీ
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించారు.
విల్ జాక్స్ (0), జేమీ స్మిత్ (6), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జేకబ్ బేథెల్ (13), బ్రైడన్ కార్స్ (9), మాథ్యూ పాట్స్ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్ రషీద్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్ ఈ పరుగులు చేయకుండి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును తాకేది కాదు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు.
రాణించిన షార్ట్
ఛేదనలో ఆస్ట్రేలియా ఆది నుంచి వేగంగా ఆడింది. తొలి 10 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్కును దాటింది. మాథ్యూ షార్ట్ మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 58; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా.. బంతితో మ్యాజిక్ చేసిన ట్రవిస్ హెడ్ ఓ మోస్తరు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడాడు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి స్టీవ్ స్మిత్ (48 బంతుల్లో 36), జోష్ ఇంగ్లిస్ (20 బంతుల్లో 28) క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బంతితో రాణించి, సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో అలరించిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేలు, ఐదో వన్డే ఆసీస్ గెలువగా.. ఇంగ్లండ్ మూడు, నాలుగు వన్డేల్లో విజయాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment