మహిళల క్రికెట్‌లో ఇటీవలి కాలంలో సేమ్ జెండర్ మ్యారేజెస్ ఎక్కువయ్యాయి. గడిచిన ఏడాది కాలంలో ముగ్గురు నలుగురు మహిళా క్రికెటర్లు తమ ప్రియురాళ్లను పెళ్లాడారు. గత నెలలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్.. తన ప్రియ సఖిని వివాహం చేసుకుంది.
తాజాగా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ పియెపా క్లియరీ.. ఇంగ్లండ్ మహిళా జట్టు వికెట్‌కీపర్ ఆమీ జోన్స్‌తో నిశ్చితార్ధం చేసుకుంది. ఈ విషయాన్ని వారు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. క్లియెరీ, ఆమీ తమతమ జాతీయ జట్ల మధ్య ఉన్న వైరాన్ని పక్కన పెట్టి రింగులు మార్చుకున్నారు. క్లియెరీ, ఆమీ బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా పరిచయమయ్యారు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు.
31 ఏళ్ల ఆమీ జోన్స్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 6 టెస్ట్‌లు, 91 వన్డేలు, 107 టీ20లు ఆడింది. ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్ జట్టులో కీలకంగా వ్యవహరిస్తుంది. వికెట్‌కీపింగ్ బ్యాటర్ అయిన ఆమీ.. తన కెరీర్ మొత్తంలో 202 మ్యాచ్‌లు ఆడి 20 హాఫ్ సెంచరీల సాయంతో 3500 పైచిలుకు పరుగులు చేసింది. అలాగే వికెట్‌కీపింగ్‌లో 140 మందిని ఔట్ చేయడంలో భాగమైంది.
పియెపా క్లియెరీ విషయానికొస్తే.. 28 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు. దేశవాలీ క్రికెట్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్ కౌంటీలు ఆడిన క్లియెరీ.. లిస్ట్-ఏ క్రికెట్‌లో 52, టీ20ల్లో 62 వికెట్లు తీసింది.
Comments
Please login to add a commentAdd a comment