
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మతో స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హెడ్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ సన్‌రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు.
సెంచరీ చేసిన తర్వాత లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హెడ్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
TRAVIS HEAD - FASTEST HUNDRED BY SRH BATTER IN IPL HISTORY 🤯pic.twitter.com/GvWCPFpRkd
— Johns. (@CricCrazyJohns) April 15, 2024