చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ? | Travis Head hits fastest century for Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

#Travis Head: చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ?

Published Tue, Apr 16 2024 6:00 AM | Last Updated on Tue, Apr 16 2024 10:05 AM

Travis Head hits fastest century for Sunrisers Hyderabad, - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో హెడ్‌ కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్‌ 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన హెడ్‌ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ఆటగాడిగా హెడ్‌ రికార్డులకెక్కాడు.

అదే విధంగా ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్ గేల్(30 బంతులు) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. యూసఫ్ పఠాన్(37 బంతులు), డేవిడ్ మిల్లర్(38 బంతులు) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇ​క​ ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement