
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

అనంతరం హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది.

ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు.
























