
హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో చివరకు హైదరాబాద్ పైచేయి సాధించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.


















