ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఇండియన్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ వీర లెవెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. తొలుత ఓపెనర్ ట్రవిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అభిషేక్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి హెడ్ రికార్డును బద్దలు కొట్టాడు.
హెడ్, అభిషేక్ శివాలెత్తడంతో పవర్ ప్లేల్లో అత్యధిక టీమ్ స్కోర్‌ను (81/1) నమోదు చేసిన సన్‌రైజర్స్.. ఐపీఎల్‌లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ (148/2) రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో హెడ్ 24 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేయగా.. అభిషేక్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. 13 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 161/3గా ఉంది. అంతకుముందు మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి హార్దిక్ బౌలింగ్ ఔటయ్యాడు. హార్దిక్, పియుశ్ చావ్లా, కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment