#Abhishek Sharma: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. గత కొన్ని రోజులుగా భారీ స్కోర్లు నమోదు చేయలేక చతికిల పడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఉప్పల్‌లో మాత్రం శివాలెత్తిపోయాడు.
మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ.
హెడ్‌తో కలిసి అజేయంగా నిలిచి 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ టార్గెట్ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియాన్నిహోరెత్తించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
That's Sunrisers Hyderabad for you 💥#IPLonJioCinema #SRHvLSG #TATAIPL pic.twitter.com/xFiuuafuXa
— JioCinema (@JioCinema) May 8, 2024
యువీ పాజీకి థాంక్స్
ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆరంభానికి ముందు నేను చేసిన హార్డ్‌వర్క్ ఫలితాన్నిస్తోంది. యువీ పాజీ(యువరాజ్ సింగ్), బ్రియన్ లారా, నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్నే నా మొదటి కోచ్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు 23 ఏళ్ల అభిషేక్.
కాస్త ఓపికగా పట్టు
ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అద్భుతంగా ఆడావు అభిషేక్ శర్మ. ఇలాగే నిలకడగా ఆడు. కాస్త ఓపికగా ఉండు! త్వరలోనే నీకూ టైమ్ వస్తుంది’’ అంటూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షించాడు.
అదే విధంగా ట్రావిస్ హెడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు ఫ్రెండ్? అస్సలు నమ్మలేకున్నాం’’ అని యువీ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మకు మెంటార్!!
సూపర్ అభి
కాగా ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28). మొత్తం 195 బంతుల్లో 35 సిక్సర్ల సాయంతో 401 పరుగులు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్లు
👉వేదిక: ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్
👉టాస్: లక్నో.. బ్యాటింగ్
👉లక్నో స్కోరు: 165/4 (20)
👉సన్‌రైజర్స్ స్కోరు: 167/0 (9.4)
👉ఫలితం: 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన సన్‌రైజర్స్
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 89 రన్స్- నాటౌట్).
Comments
Please login to add a commentAdd a comment