
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శివాలెత్తిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ తరఫున ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ.
ముంబైపై వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాట్ కమిన్స్ పేరిట ఉంది. 2022 సీజన్‌లో కమిన్స్ కేకేఆర్ తరఫున ఆడుతూ ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 2018 సీజన్‌లో పంత్ (ఢిల్లీ) ముంబైపై 18 బంతుల్లో ఫిఫ్టి పూర్తి చేశాడు. తాజాగా హెడ్.. పంత్ రికార్డును సమం చేశాడు.
A 𝙃𝙚𝙖𝙙 𝙎𝙩𝙖𝙧𝙩 for @SunRisers 🧡
— IndianPremierLeague (@IPL) March 27, 2024
Travis Head is back in #TATAIPL & how! 🔥
Follow the match ▶️https://t.co/oi6mgyCP5s #SRHvMI pic.twitter.com/VYeXa36Ptt
ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 24 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. హెడ్ పేట్రేగిపోవడంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేల్లో తమ అత్యధిక స్కోర్‌ను (81/1) నమోదు చేసింది. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ కూడా రెచ్చిపోతున్నాడు.
ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో 3 సిక్సర్లు కొట్టిన అభిషేక్.. ఎనిమిదో ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది జోరుమీదున్నాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/2గా ఉంది. అభిషేక్‌తో పాటు మార్క్రమ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి మూల్యం చెల్లించుకుంది.