ఖందేవునికి మొక్కుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఖందేవ్ జాతర శనివారం ప్రారంభమైంది. పక్షం పాటు జరగనున్న జాతరకు ఉమ్మడి జిల్లాలు సహా వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా త రలి వచ్చారు. తమ ఆరాధ్య దైవమైన ఖందేవునికి ఏటా పు ష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటా రు. ఇందుకోసం తమ ఇళ్లలో తయారుచేసిన నువ్వుల నూనె ను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
ప్రతి ఇంటి నుంచి సేకరించిన నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం అనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితి తాలుకా కొద్దిగూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి శనివారం ఆల య సన్నిధిలో రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొ క్కు తీర్చుకుంది. ఇలాచేస్తే సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయ్యారు. కార్యక్రమంలో తొ డసం వంశ పెద్దలు బాపూరావ్ కటోడా, ఆనందరావ్ కటో డా, రాజు, యాదవ్‌రావ్, బండు, గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment