khandev fair
-
నూనె తాగి.. మొక్కు తీర్చి
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఖందేవ్ జాతర శనివారం ప్రారంభమైంది. పక్షం పాటు జరగనున్న జాతరకు ఉమ్మడి జిల్లాలు సహా వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా త రలి వచ్చారు. తమ ఆరాధ్య దైవమైన ఖందేవునికి ఏటా పు ష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటా రు. ఇందుకోసం తమ ఇళ్లలో తయారుచేసిన నువ్వుల నూనె ను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం అనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితి తాలుకా కొద్దిగూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి శనివారం ఆల య సన్నిధిలో రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొ క్కు తీర్చుకుంది. ఇలాచేస్తే సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయ్యారు. కార్యక్రమంలో తొ డసం వంశ పెద్దలు బాపూరావ్ కటోడా, ఆనందరావ్ కటో డా, రాజు, యాదవ్రావ్, బండు, గోపాల్ పాల్గొన్నారు. -
రెండు కిలోల నూనె తాగి..
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో సోమవారం ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఈ జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కాగా, తోడసం వంశానికి చెం దిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఖాందేవ్ జాతరలో ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం వారు నెలరోజుల ముందే నువ్వుల నూనె ను ఇంటి వద్దే తయారు చేస్తారు. తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకొచ్చిన నువ్వుల నూనెను సేకరిస్తారు. అలా సేకరించిన నూనెను గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశ ఆడపడుచు కుమ్ర లక్ష్మీబాయి తాగి మొక్కు తీర్చుకుంది. రెండేళ్లుగా నూనె తాగి మొక్కు తీర్చుకుంటున్నానని, ఈ ఏడాది మొక్కు తీరిపోతుందని ఆమె పేర్కొంది. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుం దని వారి నమ్మకం. ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావ్ పాల్గొన్నారు. అయితే, ఈ ఆచారం 80 ఏళ్లుగా వస్తుందని, తోడసం వంశానికి చెందిన ఆడపడుచులు మూడేళ్లకు ఒకరు నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావు తెలిపారు. -
మొక్కు కోసం రెండు కిలోల నువ్వుల నూనె తాగింది
సంప్రదాయం, ఆచార వ్యవహారాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. మండల కేంద్రమైన నార్నూర్‌లో ఆదివారం రాత్రి ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తోడసం వంశస్థులు పూజలు చేసి డోలు వాద్యాల మధ్య పూజలు ప్రారంభించారు. తోడసం వంశానికి చెందిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కును తీర్చుకోవడం ఆనవాయితీ. తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకోవచ్చిన నువ్వుల నూనె సేకరిస్తారు. రెండు కిలోల నూనెను దేవుని సన్నిధిలో సోమవారం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశం ఆడపడుచు కుమ్ర లక్ష్మీబాయి తాగి తమ మొక్కును తీర్చుకుంది. గత రెండేళ్లుగా నూనె తాగి మొక్కు తీర్చుకుంటున్నానని, ఈ ఏడాదితో మొక్కు తీరిపోతుందని ఆమె పేర్కొంది. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని ఈ వంశం వారి నమ్మకమని ఆలయ పూజారి తోడసం ఖమ్ము, తోడసం సోనేరావ్ తెలిపారు.