సాక్షి, నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఎన్నో ఎళ్ల తర్వాత మెడికల్ వచ్చింది.. కానీ సిద్దిపేట మెడికల్ కాలేజీకి 70 కోట్లు ఇచ్చి, నల్లగొండకు మాత్రం 250 కోట్లు ఇచ్చారు. వాళ్ల ప్రాంతానికి ఓరకంగా.. మా ప్రాంతానికి ఓ రకంగా నిధులు మంజూరు చేశారు. వాళ్ల ప్రాంతంలో ప్రమాదంలో చనిపోతే ఓ రకంగా, మా ప్రాంతంలో ఓ రకంగా ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారు. బతుకమ్మ చీరలకు కేవలం సిరిసిల్లకు 250 కోట్ల ఆర్డర్ ఇచ్చారు.., రాష్ట్రంలో ఏ జిల్లాలో చీరలు నేయరా..? సిద్ధిపేట, సిరిసిల్లకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రా?
కాళేశ్వరానికి ఎక్కువ నిధులు , ఎస్‌ఎల్‌బీసి ప్రాజెక్టుకి నిధులు ఉండవు. నల్లగొండ జిల్లా తెలంగాణలో ప్రాంతం కాదా? కుర్చీ వేసుకుని ఎస్‌ఎల్‌బీసి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇపుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను మొదలుపెట్టించింది కాబట్టే ఇంత నిర్లక్ష్యం. మిషన్ భగీరథ కుంభకోణాలపై ప్రశ్నించినందుకు ఇలా చేస్తున్నారు. పండించే పంటకు మద్దతు ధర, బోనస్ ఇస్తే రైతులు బాగుపడతారు. జూన్ 2 న 50 వేల పోస్టులని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఐకేపీ ధాన్యం డబ్బులు, ఉపాధి హామీ పనుల బకాయిలు అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఆర్టీసీ ఎత్తివేయడానికి కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్‌లకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’ అని వెల్లడించారు. మరోవైపు బొడ్డపల్లి శ్రీను హత్య, అకారణంగా ఎమ్మెల్యే పదవి రద్దు, గన్‌మెన్‌లను తొలగింపు.. ఇవన్నీ నాపై కావాలనే కుట్ర జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు ఎమ్మెల్యేగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేయడబోతున్నాను.
Comments
Please login to add a commentAdd a comment