కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధి
సాక్షి, నల్లగొండ : ‘మా నాన్న తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నాడు.. 11 రోజులు ఆమరణ దీక్ష చేశాడు.. ఆయన ఎంతో సౌమ్యుడు.. సహాయ గుణం, సానుభూతి ఆయనకు వెన్నతో పెట్టినవి. అలాంటి మా నాన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించండి’ అని కాంగ్రెస్ నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధి అమెరికానుంచి నియోజకవర్గ ప్రజలకు మీ చెల్లిగా అభ్యర్థిస్తున్నానని బుధవారం ఒక ప్రకటనను మెయిల్ ద్వారా పంపింది. అందరినీ తన వాళ్లుగా చూసుకునే తత్వం నాన్నదని పేర్కొంది. తన చిన్నతనం నుంచి నాన్ననుంచి నేర్చుకున్నది «ధైర్యం, సానుభూతి, సహాయ గుణమని తెలిపింది. చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన నాన్న ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నల్లగొండ ప్రజలకే కాదు.. తెలంగాణ ప్రజలకు కూడా తనదైన స్వరం అందించిన తీరు అనుసరణీయమని పేర్కొంది.
‘జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఫ్లోరిన్ రహిత నీటికోసం పోరాడిన యోధుడిగా నాన్న మీ అందరికీ సుపరిచితమే.. ఎందరో జీవితాలను ప్రభావితం చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది తెలంగాణ సాధన కోసం మం త్రి పదవిని వదులుకున్న త్యాగశీలి నాన్న. మా బాల్యాన్ని నాన్న మిస్సవుతున్నా వేలా ది మంది పిల్లలకు వైద్య, విద్యను అందిస్తూ ఆనందమయ జీవితాన్ని అందిస్తున్నందుకు మాకెంతో సం తోషం. మొన్న వేసవిలో నాన్నతో ప్రజల్లోకి వెళ్తే నాకు ఎంతో ఆనందం, ఆశ్చర్యం కలిగింది. 9వ తరగతి అమ్మాయి నాన్నను ఆప్యాయంగా పెదనాన్న అని సంబోధిస్తుంటే నా కళ్లు ఆనందభాష్పాలకు నెలవులయ్యాయి. నాకు తమ్ముళ్లు, చెల్లెల్లు ఎందరో.. లెక్కపెట్టగలనా అనిపించింది. నాన్న సేవల లెక్క తేలడం అంత కష్టం. అలాంటి నాయకుడి బిడ్డనయినందుకు గర్విస్తున్నాను. ఈ సమయంలో నేను అక్కడ లేనందుకు చింతిస్తున్నాను. అందుకే ఈ మాధ్యమం ద్వారా మీకు విన్నవించుకుంటున్నా’ అని వివరించింది. మనందరి సంపూర్ణమద్దతు నాన్నకు అందిద్దామని, నాన్నను మళ్లీ మన ఎమ్మెల్యేగా మరింత శక్తివంతమైన నాయకుడిగా చూద్దామని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment