
కేసీఆర్ సమయం ఇవ్వడం లేదు: కోమటిరెడ్డి
నల్లగొండ: ఎంపీలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇవ్వడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజుకు 2 వేల మంది ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు వినేవారని గుర్తు చేశారు.
గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ తరచుగా భేటీ కావడాన్నిఆయన తప్పుబట్టారు. వారానికి నాలుగుసార్లు గవర్నర్‌తో చర్చలు అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. కుమారురు, కూతురుతో కలిసి తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఏపీ కాంట్రాక్టర్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.