
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. కేటీఆర్ డబ్బు మదంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తీవ్ర స్ధాయిలో ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథలో సగం కాంట్రాక్టులు కేటీఆర్‌కు చెందినవేనని.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే తరచూ విదేశాలకు వెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేతగానితనం వల్లే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.
మరోవైపు 'టీఆర్‌ఎస్ తలుపులు తట్టీ తట్టీ కుదరక కోమటిరెడ్డి వెనక్కి పోయారు' అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన ఆఫీస్‌కు వచ్చి మంత్రి పదవి ఇస్తానని కేటీఆర్ ఆఫర్ చేశారని.. కావాలంటే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయట పెడతానని కోమటిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment