కాంగ్రెస్ పార్టీని వీడను: కోమటిరెడ్డి
నల్లగొండ రూరల్ : తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని కొందరు.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తి అవాస్తవమన్నారు. కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పి.. పలువురు ప్రజాప్రతినిధులను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీని వీడిన వారిని పట్టించుకోవద్దన్నారు.