b.r ambedkar
-
కాంగ్రెస్ పార్టీని వీడను: కోమటిరెడ్డి
నల్లగొండ రూరల్ : తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని కొందరు.. టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తి అవాస్తవమన్నారు. కోమటిరెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని చెప్పి.. పలువురు ప్రజాప్రతినిధులను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీని వీడిన వారిని పట్టించుకోవద్దన్నారు. -
బాక్సింగ్ టోర్నీలో సంతోష్‌కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలిండియా పురుషుల ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్లు సత్తా చాట్టారు. విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ బాక్సర్ సంతోష్ పసిడి పతకం గెలిచాడు. పి.మనోజ్‌రెడ్డి, ఎం.డి.ఇమ్రాన్, అనురాగ్ కాంస్య పతకాలను గెలుపొందారు. ఎండి. జాహెద్ బెస్ట్ లూజర్ అవార్డును అందుకున్నాడు. నేడు బాక్సింగ్ సెలక్షన్ కమ్ టోర్నీ రాష్ట్ర సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ (టీబీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ఆసక్తి గల బాక్సర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ప్రతాప్‌రెడ్డి (94401-63038)ని సంప్రదించ వచ్చు. -
ఆదర్శనీయుడు అంబేద్కర్
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు ఆయూ కార్యాలయూల్లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటాలు, ప్రధాన కూడళ్లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను కొనియూడారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం అర్బన్ : బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అంబేద్కర్ అని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. స్థానిక రెండో రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీజీసీ సభ్యులు బి.గురునాథ్‌రెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు ఎగ్గులు శ్రీనివాసులు, ట్రేడ్ యూనియన్ నేతలు కొర్రపాడు హుస్సేన్ పీరా, ఆలూమూరు శ్రీనివాస్‌రెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, బొరంపల్లి ఆంజినేయులు, సుధాకర్‌రెడ్డి, ప్రసాద్, విద్యార్థి విభాగం నేతలు బండి పరుశురాం, నరేంద్రరెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మార్గ నిర్దేశకుడు అంబేద్కర్ అనంతపురం సిటీ : సమాజానికి మార్గ నిర్దేశకుడు బి.ఆర్. అంబేద్కర్ అని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దళితులు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రసంగించారు. అనంతరం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాం గ్రెస్ నగర అధ్యక్షుడు దాదా గాంధీ, కాంగ్రెస్ నేతలు పి.వి.అనిల్‌చౌదరి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు దేవమ్మ, ఐఎన్టీయూసీ నేత రమణపాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం అనంతపురం కల్చరల్ : అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకాళ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. అంకాళ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి చల్లపల్లి నరసింహారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వేంకటేశ్వరరెడ్డి, జగన్మహోన్, సీనియర్ నేతలు ఓలేటి రత్నమయ్య, అమరనాథ్, రమణ, మహిళా విభాగం నేతలు ఆదిలక్ష్మమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. సమసమాజ నిర్మాత అంబేద్కర్ : ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ : సమసమాజ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అని ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళుల్పరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడిన మహామనిషి అన్నారు. జిల్లా నేతలు ధనుంజయ యాదవ్, జలగల రమేష్, ఎగ్గుల శ్రీనివాసులు, పెన్నోబలేసు, గౌస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీలో విచిత్రం!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: రెగ్యులర్ బోధకుల పోస్టుల భర్తీ వ్యవహారంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారుల తీరు అందరికీ ఆశ్చర్యం కలిగి స్తోంది. విద్యార్థుల ప్రయోజనం కోసం కాకుండా మరిదేనికోసమో పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. యూనివర్సిటీ అవసరాలను ప్రభుత్వానికి సరిగా నివేదించకపోవటమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల వివరణ ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఇదీ సంగతి.. యూనివర్సిటీలో 34 రెగ్యులర్ బోధకుల పోస్టుల భర్తీకి గత ఏడాది జూన్ 22న నోటి ఫికేషన్ విడుదల చేశారు. మరో 15 పోస్టుల భర్తీకి ఈ నెల 1న మరో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆయా కోర్సుల కు ఉన్న ఆదరణ, విద్యార్థుల సంఖ్యను పట్టించుకోకుండా పోస్టులు మంజూరవటం విస్మయం కలిగిస్తోంది. వర్సిటీలో 2009లో ప్రారంభించిన జియో సైన్స్ కోర్సుకు రెగ్యులర్ బోధకులు లేరు. మూడేళ్లు చదివితే జియో టెక్ డిగ్రీ, రెండేళ్లతో సరిపెడితే జియో ఫిజిక్స్‌లో పీరూ. డిగ్రీ ఇస్తున్నారు. ఈ కోర్సులు చేసినవారికి విదేశాల్లో కూడా మంచి ఉపాధి అవకాశా లు లభిస్తున్నాయి. ఈ విభాగానికి ఏడుగురు రెగ్యులర్ బోధకులు అవసరం కాగా ఒక్కరు కూడా లేరు. టీచింగ్ అసోసియే ట్లు, సబ్జెక్టు కాంట్రాక్టర్లతో నెట్టుకువస్తున్నారు. ఎంబీఏలో 40 సీట్లు ఉండగా ఈ ఏడాది వీటి సంఖ్యను 60కు పెంచారు. కామర్స్ అండ్ మేనేజ్మెంట్(ఎంబీఏ, ఎంకాం) విభాగాలకు కలిపి ఇద్దరు రెగ్యులర్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. అయినా ఈ విభాగానికి రెగ్యులర్ బోధకులను కేటాయించలేదు. ఎంఏ(తెలుగు) కోర్సులో శతశాతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కోర్సు బడ్జెట్‌కు ఇంతవరకు ప్రభుత్వ అనుమతి కూడా లభించలేదు. దీంతో టీచింగ్ అసోసియేట్లతోనే నిర్వహి స్తున్నారు. వీటికి మాత్రం ప్రాధాన్యం.. ఇప్పటికే నలుగురు రెగ్యులర్ బోధకులు ఉన్న బయో టెక్నాలరూ. విభాగంలో మరో మూడు పోస్టులు భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. గతేడాది ఈ కోర్సు ఫస్టియర్‌లో 17 మంది మాత్రమే చేరారు. వాస్తవానికి తొలుత ఒక్కరు కూడా చేరలేదు. కోర్సు ఫీజును సగానికి తగ్గించటంతోపాటు అర్హతల విషయంలో సడలింపులు ఇచ్చి రూ.దు జిల్లాల్లో పత్రికా ప్రకటనలు ఇచ్చాక ఈ మాత్రం అడ్మిషన్లు జరిగాయి. ఇక ద్వితీ య సంవత్సరంలో కేవలం 8 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ కోర్సులో 40 సీట్లు ఉండగా 18 మంది చేరారు. సెకండియర్‌లో 10 మంది మాత్రమే ఉన్నారు. ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు ఏయూలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు తొలుత ఒక్కరు కూడా హాజ రు కాలేదు. చివరికి ఇక్కడ అంతర్గత కౌన్సె లింగ్ నిర్వహించి విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ విభాగంలో ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లు ఇద్దరు ఉండగా మరో నాలుగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. సోషల్ వర్కులో 40 సీట్లు ఉండగా 21 సీట్లు నిండాయి. ద్వితీయ సంవత్సరంలో 19 మంది ఉన్నారు. ఈ విభాగంలో ముగ్గు రు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా మరో మూడు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో 65 సీట్లు ఉండగా ఫస్టియర్‌లో 46 మంది చేరారు. వీరిలో 40 మంది తొలి సెమిస్టర్ ఫీజు చెల్లించగా 33 మందే పరీక్షలు రాశారు. కేవలం ఏడుగురే రెగ్యులర్‌గా తరగతులకు హాజరవుతున్నారు. సెకండియర్‌లో 12 మంది, ఫైనలియర్లో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఈ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా లేదు. అయినా ఈ విభాగంలో ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంసీఏ ఫస్టియర్‌లో 14 మంది, సెకండియర్‌లో 12 మంది, ఫైనలియర్లో ఒక విద్యార్థి మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోవటంతో ఇన్చార్జి వీసీగా భగవత్‌కుమార్ ఉన్నప్పుడు దీనిని రద్దు చేయాలని భావిం చారు. రాజాంలోని రూ.ఎంఆర్రూ.టీ ఇప్పటికే ఎంసీఏ కోర్సును ఎత్తివేసింది. అలాంటిది వర్సిటీలోని ఎంసీఏ విభాగంలో నలుగురు బోధకుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వటం గమనార్హం. పోస్టులను వదులుకోలేం.. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను వదులుకోలేమని, కోర్సులను ఎత్తివేయలేమని వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. ఆయా విభాగాల వైఫల్యాలపై సమీక్షించాల్సి ఉందన్నారు. బోర్డాఫ్ స్టడీస్ ఏర్పాటు చేసి కాలానుగుణంగా సిల బస్‌లో మార్పులు చేయాలన్నారు. ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను బలోపేతం చే యటానికి, అడ్మిషన్లు పెంచటాని కి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.