ఆదర్శనీయుడు అంబేద్కర్ | Ambedkar | Sakshi
Sakshi News home page

ఆదర్శనీయుడు అంబేద్కర్

Published Sun, Dec 7 2014 3:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

Ambedkar

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్  వర్ధంతిని జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు  ఆయూ కార్యాలయూల్లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటాలు, ప్రధాన కూడళ్లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను కొనియూడారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
 
 అనంతపురం అర్బన్ :  బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అంబేద్కర్ అని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు.  స్థానిక రెండో రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీజీసీ సభ్యులు బి.గురునాథ్‌రెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు ఎగ్గులు శ్రీనివాసులు, ట్రేడ్ యూనియన్ నేతలు కొర్రపాడు హుస్సేన్ పీరా, ఆలూమూరు శ్రీనివాస్‌రెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, బొరంపల్లి ఆంజినేయులు, సుధాకర్‌రెడ్డి, ప్రసాద్, విద్యార్థి విభాగం నేతలు బండి పరుశురాం, నరేంద్రరెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 మార్గ నిర్దేశకుడు అంబేద్కర్
 అనంతపురం సిటీ : సమాజానికి మార్గ నిర్దేశకుడు బి.ఆర్. అంబేద్కర్ అని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీలో దళితులు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రసంగించారు. అనంతరం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కాం గ్రెస్ నగర అధ్యక్షుడు దాదా గాంధీ, కాంగ్రెస్ నేతలు పి.వి.అనిల్‌చౌదరి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు దేవమ్మ, ఐఎన్‌టీయూసీ నేత రమణపాల్గొన్నారు.
 
 అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం
 అనంతపురం కల్చరల్ : అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకాళ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు.  అంకాళ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి చల్లపల్లి నరసింహారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వేంకటేశ్వరరెడ్డి, జగన్మహోన్, సీనియర్  నేతలు ఓలేటి రత్నమయ్య, అమరనాథ్, రమణ, మహిళా విభాగం నేతలు ఆదిలక్ష్మమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
 
 సమసమాజ నిర్మాత అంబేద్కర్ : ఎమ్మెల్యే
 అనంతపురం అర్బన్ : సమసమాజ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అని ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళుల్పరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడిన మహామనిషి అన్నారు. జిల్లా నేతలు ధనుంజయ యాదవ్, జలగల రమేష్, ఎగ్గుల శ్రీనివాసులు, పెన్నోబలేసు, గౌస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement